మత్తు వదలరా2కు సర్వం సిద్ధం
2019లో కరోనాకు ముందు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మత్తు వదలరా సినిమా ఎంత మంచి హిట్ అందుకుందో తెలిసిందే. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కొత్త కుర్రాళ్లతో డైరెక్టర్ రితేష్ రానా చేసిన ప్రయోగం బాగా వర్కవుట్ అయ్యి, సినిమాను బ్లాక్ బస్టర్ ను చేసింది. ఆ నమ్మకంతోనే రితేష్ కు మైత్రీ మూవీ మేకర్స్ హ్యాపీ బర్త్ డే రూపంలో ఛాన్స్ ఇచ్చింది.
కానీ ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. మరోవైపు శ్రీ సింహాకు కూడా మత్తు వదులరా తర్వాత హిట్ రాలేదు. దీంతో ఇక లాభం లేదని వీరిద్దరూ కలిసి మత్తు వదలరా2 కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి జూన్ కు సినిమాను రెడీ చేయాలని ప్లాన్ చేసుకున్నారట.
అంటే కేవలం నాలుగు నెలల్లోనే సినిమాను పూర్తి చేయనున్నారన్నమాట. కాల భైరవనే ఈ సినిమాకు కూడా సంగీతం అందిచనున్నాడు. మత్తు వదలరాలో నవ్వులు పూయించిన సత్య ఈ సినిమాలో కూడా భాగం కానున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. క్రైమ్, కామెడీ, సస్పెన్స్ ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ కథను రితేష్ రాసుకున్నాడని సమాచారం. మరి ఈ సినిమాతో అయినా శ్రీ సింహా ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.













