మాస్ కా దాస్ ట్రిబ్యూట్ టు మాస్ కా బాప్
ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తోందంటే అభిమానులందరికీ పండగే. ఒక హీరోను సామాన్య ప్రజలే కాదు హీరోలు కూడా అభిమానిస్తుంటారు. ఉదాహరణకు పవన్ కల్యాణ్‌కు నితిన్ హార్డ్‌కోర్ ఫ్యాన్. నితిన్‌కి సంబంధించిన సినిమా ఫంక్షన్లకు పవన్‌కల్యాణ్ రావడం తన అభిమాని చేసిన సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆక్షాంక్షించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్‌కు అలాంటి హార్డ్‌కోర్ ఫ్యాన్ ఉన్నాడు. అతనే ఫలక్‌నుమా దాస్, హిట్ చిత్రాల హీరో విశ్వక్సేన్. తను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని, ఎన్టీఆర్‌లా ఎవరూ యాక్ట్ చెయ్యలేరని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు విశ్వక్. మే 20 ఎన్టీఆర్ 37వ పుట్టినరోజు. తన అభిమాన హీరోకు ఈ పుట్టినరోజు సందర్భంగా ఓ పాట రూపంలో కానుక అందించాడు. మాస్ కా దాస్ ట్రిబ్యూట్ టు మాస్ కా బాప్ పేరుతో ఒక ర్యాప్ సాంగ్‌ను చేశాడు. బుధవారం ఉదయం ఈ పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్ అభిమానులనే కాదు అందర్నీ ఆకట్టుకునేలా ఈ పాట ఉంది. ఈ పాటకు సంబంధించిన విజువల్స్‌లో ఎన్టీఆర్‌తోపాటు విశ్వక్ సేన్ కూడా కనిపిస్తాడు.













