మారుతి అయినా ప్రభాస్ ను అలా చూపిస్తాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ తన ఫ్యాన్స్ కు గత కొంతకాలంగా ఓ కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న ఏ డైరెక్టర్ కూడా ఆయన్ని వింటేజ్ లుక్ లో చూపించడం లేదు. సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్స్ విషయంలో ఆదిపురుష్ టైమ్ లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది.
ఈ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ పడుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ లుక్స్ తప్పించి మిగిలిన అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాల్లో అతని లుక్ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశ పరుస్తూ వచ్చాయి. సలార్ లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ లో కనిపించడని క్లారిటీ వచ్చింది. ఇక మిగిలింది కల్కి, రాజా డీలక్స్ సినిమాలు.
వీటిలో కల్కి నుంచి లీకైన గ్లింప్స్ లో ప్రభాస్ లుక్స్ ఇంప్రెస్సివ్ గా లేవు. కాబట్టి మారుతినే ప్రభాస్ ను వింటేజ్ లుక్స్ లో చూపించగలడు. దానికి తోడు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉన్నారు కాబట్టి ప్రభాస్ ను మంచి లుక్స్ తో ఎలివేట్ చేయొచ్చు. మరి డార్లింగ్ ఫ్యాన్స్ కోరికను మారుతి తీరుస్తాడా లేదా అన్నది చూడాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.













