మారుతి ఇక స్పీడు పెంచాల్సిందే!
వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. మరో సంవత్సరం వరకు ప్రభాస్ డేట్స్ ఖాళీగా లేవు. ఏడాదికి రెండు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా చూస్తానని ప్రభాస్ తన ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. దానికి తగ్గట్టే ఈ ఇయర్ ఆదిపురుష్, సలార్ తో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఆదిపురుష్ ఫ్లాప్ అయినా, సలార్ తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
వచ్చే యేడాది కల్కి తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నాడు ప్రభాస్. దీంతో పాటూ ప్రభాస్, మారుతి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో తెరకెక్కుతున్న లో బడ్జెట్ ఫిల్మ్ ఇదే. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జానర్ లో రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను మారుతి తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి మారుతి ప్లాన్ చేస్తున్నాడట. సంక్రాంతి కానుకగా ఆ గ్లింప్స్ రానుందని, మారుతి ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ లేకుండా పని చేస్తున్నాడని టాక్. సినిమా సక్సెస్ అయితే అందులో షేర్ తీసుకునేలా ప్రభాస్ డీల్ సెట్ చేసుకున్నాడ. ఇప్పటి వరకు అనౌన్స్ చేయని ఈ సినిమా గురించి మేకర్స్ ఇకమీదనైనా ఏవొకటి రెగ్యులర్ గా అప్డేట్స్ రూపంలో ఇస్తే సినిమాకు హైప్ పెరుగుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.













