మారుతి పెద్ద స్కెచ్చే వేశాడుగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ వైపు వందల కోట్ల బడ్జెట్ తో భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరోవైపు మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే రాజా సాబ్ ఫస్ట్ లుక్ రిలీజైందో అప్పటినుంచి ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిని నమ్మడం మొదలుపెట్టారు.
రాజా సాబ్ పోస్టర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ అంతా తెగ సంబరపడిపోయారు. ఈ సినిమా డిఫరెంట్ కథతో థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందుతుంది. ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసిన మారుతి ఈ సినిమాతో తన రేంజ్, మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. రాజా సాబ్ సినిమాతో డైరెక్టర్ గా మారుతి మరో మెట్టు ఎక్కాలని చూస్తున్నాడు.
అందులో భాగంగానే రాజా సాబ్ ను చాలా జాగ్రత్తగా, ప్రభాస్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయకుండా ఉండేలా తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేయడం కష్టం కాబట్టే మారుతి ఎప్పుడూ లేని విధంగా రాజా సాబ్ కోసం ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడు. ప్రభాస్ కూడా వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల మారుతికి తను అనుకున్నంత టైమ్ దొరికింది. ఈ సినిమా తర్వాత మారుతి పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్ లోకి చేరిపోతాడని, ఒకవేళ మారుతి బాలీవుడ్ కు జంప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. సో, మారుతి ఫ్యూచర్ రాజా సాబ్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట.













