ప్రభాస్ మారుతి సినిమా టైటిల్లో మార్పు?
రీసెంట్ గా సలార్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ తర్వాతి సినిమాలపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో కల్కి సినిమాతో పాటూ మారుతి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ సంవత్సరం నుంచి ఏదొక వార్తలొస్తూనే ఉన్నాయి.
కానీ ఈ సినిమా విషయంలో మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. సలార్ హిట్ అవడంతో ఆ జోష్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ఓ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతికి ఈ సినిమా టైటిల్‌తో పాటూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
వాస్తవానికి ఈ సినిమాను మొదలుపెట్టిన టైమ్ లో ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ టైటిల్ కాదని మేకర్స్ తమ సన్నిహితుల దగ్గర పలుమార్లు చెప్పారు. రీసెంట్ గా ఈ సినిమాకు రాజా సాబ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ ను చేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













