మాట నిలబెట్టుకున్న మారుతి
కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా ది రాజా సాబ్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాడు. సినిమా ఇప్పుడే రిలీజ్ అవదు కాబట్టి ఇప్పట్లో సినిమోకు ప్రమోషన్స్ చేయరనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది.
కాన్సెప్ట్ టీజర్ కాకపోయినా ఎప్పటినుంచో రాజా సాబ్ విషయంలో మారుతి, ప్రభాస్ ఫ్యాన్స్ ను ఊరిస్తున్న వింటేజ్ లుక్స్ తో టీజర్ ను కట్ చేశారు. ఫ్యాన్ ఇండియా టీజర్ అన్నారు కాబట్టి జస్ట్ ప్రభాస్ ను మాత్రమే చూపించారు. మంచి సూట్ లో పువ్వులు పట్టుకుని సైడ్ మిర్రర్ లో తనను తాను చూసుకుని ప్రభాస్ ఇచ్చే స్మైల్ కు ఎవరైనా ఫిదా అవాల్సిందే అనేట్లుంది.
ప్రభాస్ చాలా రోజుల తర్వాత యాక్షన్ మోడ్ నుంచి బయటికొచ్చి ఈ సినిమా చేస్తున్నాడు. గ్లింప్స్ ను బట్టి చూస్తుంటే రాజా సాబ్ లో ప్రభాస్ లుక్స్ చాలా ఫ్రెష్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. అంటే కల్కి తర్వాత 10 నెలలకు డార్లింగ్ ను ఫ్యాన్స్ బిగ్ స్క్రీన్ పై చూడొచ్చన్నమాట. హారర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.













