రాజా సాబ్ బడ్జెట్ పై మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు
బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డార్లింగ్ కాస్తా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి నుంచి ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ హై బడ్జెట్ సినిమాలే. ఒక్కో సినిమాను భారీగా ఖర్చు పెట్టి నిర్మాతలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ తో చేస్తున్న కల్కి సినిమాకు కూడా భారీగా ఖర్చవుతుంది.
రోజుకి కోట్ల రూపాయలలో ఖర్చు ఉంటుంది. అయితే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో మొదటిసారి పని చేస్తున్న లిమిటెడ్ బడ్జెట్ డైరెక్టర్ మారుతి ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజా సాబ్ సినిమాకు రోజుకు ఎంత ఖర్చు చేస్తున్నారని నెటిజన్లు ఆరా తీయగా తాజాగా వారి ప్రశ్నకు సమాధానం దొరికింది.
కెరీర్ స్టార్టింగ్ లో ఈ రోజుల్లో సినిమాను రూ.30 లక్షల బడ్జెట్ లో పూర్తి చేసిన మారుతి, తను ప్రస్తుతం చేస్తున్న రాజా సాబ్ 4 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ.4 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్లు సమాచారం. అంటే రోజుకు కోటి ఖర్చు పెట్టించాడన్నమాట. ఒకవేళ ప్రభాస్ తో సినిమా చేయకపోతే ఈ బడ్జెట్ లో రెండు మూడు సినిమాలు తీసేవాడినని, ఒక్క రోజు బడ్జెట్ తో ఒక సినిమా పూర్తి చేసేవాడినని మారుతి తెలిపాడు. ప్రభాస్ తో చేస్తున్న రాజా సాబ్ మంచి సక్సెస్ అయితే మారుతి స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరడం ఖాయం.













