మార్షల్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ సెప్టెంబర్ 13 న
అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 13 న విడుదలవుతోంది.
“కెజిఎఫ్” మ్యూజిక్ ఫేమ్ రవిబసురి తెలుగు సినిమా మార్షల్ ని సినిమా చూసి కంటెంట్ అనే అంశంలో ప్రత్యేకంగా నచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాలో రీ రికార్డింగ్ తో పాటు 2 పాటలను సమకూర్చాడు.
ఈ సీనిమా చూసి నచ్చి ఫస్టు కాపీ ని ఫాన్సీ ఆఫర్ రేట్ ఇచ్చి కొన్నారు RX100 సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన శివమ్ షేల్యూలైడ్స్ సురేష్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లకు పైగా రిలీజ్ చేస్తున్నారు.
నిర్మాత మరియు హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు.
ఆర్.యం.స్వామి సినిమాటోగ్రఫీ, సంగీతం, యాదగిరి వరికుప్పల, ఫైట్స్, నాభ మరియు సుబ్బు, ఎసెట్స్ గా నిలుస్థాయి.













