మళ్లీ కోహ్లీ పెళ్లి!
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు గత నెలల్లో ఇటలీ ఘనంగా పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ అనంతరం భారత్‌కు తిరిగొచ్చి ఢిల్లీలో కుటంబ సభ్యులు, వీవీఐపీలకు విందు ఇచ్చారు. తర్వాత ముంబైలో క్రికెటర్లకు రిసెప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం సౌతాఫ్రికా టూర్లో కోహ్లీ బిజీగా ఉండగా, వెంట కొత్త పెళ్లికూతురు అనుష్క కూడా వెళ్లింది. అయితే వీరిద్దరూ మరోమారు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీ-అనుష్కలు పెళ్లి చేసుకుని నెల రోజులైనా కాముందే మళ్లీ వారు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. దీనికి కారణం కూడా ఉంది. వీరిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకోవడంతో వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారట. దీంతో ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకోవడం ద్వారా మ్యారేజ్ సర్టిఫికేట్కు అప్లై చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్లో వీరి పెళ్లి వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతుండగా ఇటు కోహ్లీ ఉంచి కానీ, అటు అనుష్క నుంచి ఈ విషయంలో ఎటువంటి సృష్టత లేదు. ప్రస్తుతం కోహ్లీ సౌతాఫ్రికా టూర్‌తో బీజీగా ఉండడంతో టూర్ ముగిశాఖ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.













