పుష్ప2లో ఆ యాక్టర్ నటించట్లేదట..
ప్రస్తుతం యావత్ భారతదేశం వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప2నే. అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. దీంతో ఈ సినిమా సీక్వెల్‌పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. పుష్పలో విలన్ రోల్ చేసిన ఫాహద్ ఫాజిలే పుష్ప2 లో కూడా మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు.
ఆయనతో పాటూ జగపతి బాబు కూడా పుష్ప2లో కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్, మిగిలిన పుష్ప1 బ్యాచ్ ఎలాగూ ఈ సినిమాలో కూడా ఉంటారు. వీరితో పాటూ పుష్ప2లో బాలీవుడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి కూడా నటిస్తున్నట్లు ఈ మధ్య ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై మనోజ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
తాను పుష్ప2 లో నటించట్లేదని మనోజ్ స్పష్టం చేశాడు. తెలుగులో ఏమైనా సినిమాలు చేస్తున్నారా? ఎవరితోనైనా నటించాలనుందా అని అడిగితే, తాను తెలుగులో బన్నీతో హ్యాపీ, వేదం, పవన్ కళ్యాణ్‌తో కొమరం పులి చేశానని, టాలీవుడ్ హీరోలంతా మంచి నటులని, వాళ్లెవరితో నటించడానికైనా తాను సిద్ధమని మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు.













