Manoj Bajpai: ఆర్జీవీని తలచుకోని రోజు లేదు
మనోజ్ బాజ్పేయి(Manoj Bajpayee) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 1994లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన మనోజ్ బాజ్పేయి 1999లో ప్రేమ కథ(Prema Katha) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆ తర్వాత హ్యాపీ(Happy), వేదం(Vedam), కొమరం పులి(Komaram puli)లాంటి ఎన్నో సినిమాలతో పాటూ ది ఫ్యామిలీ మ్యాన్(The Family Man) వెబ్ సిరీస్ లో కూడా నటించి అందరినీ అలరించాడు.
తెలుగులో మనోజ్ బాజ్పేయి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడాయన. కెరీర్లో ఎన్నో మైలురాళ్లను సాధించిన ఆయన తన కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదుడుకులతో పాటూ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)తో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆర్జీవీ(RGV) డైరెక్షన్ లో వచ్చిన సత్య సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పిందని, ఆ తర్వాత కూడా ఆర్జీవీ డైరెక్షన్ లో రెండు సినిమాలు చేశానని మనోజ్ తెలిపాడు.
ఆర్జీవీ ఇచ్చిన అవకాశాలు తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో తోడ్పడ్డాయని, అందుకే ఆయన్ని ప్రతీరోజూ గుర్తు చేసుకుంటానని తెలిపిన మనోజ్ బాజ్పేయి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కంటిన్యూ అవడం మామూలు విషయం కాదని, ఎంతో పోటీ ఉంటుందని, అన్నింటినీ తట్టుకుని ఈ పొజిషన్ కు వచ్చానని, తనకు సినిమాలు తప్ప మరో లోకం తెలియలేదని మనోజ్ వెల్లడించాడు.






