మన్మథుడు 2 టీజర్ విడుదల
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలంటారు పెద్దలు. అయితే అతనికి మాత్రం వయసైపోయాక జ్ఞానోదయమైంది. యవ్వనంలో ఉన్నప్పుడు పెళ్లంటే చిరాకు పడ్డారు. అది కాస్త కరిగిపోయాక.. నాకూ ఓ పెళ్లాం కావాలి అని ఆరాటపడ్డారు. పిల్లల్ని కాలేజీలకు పంపాల్సిన వయసులో పెళ్లేంటి? అని ఇంట్లోవాళ్లు కంగారు పడ్డారు. మరి అతగాడికి పెళ్లయ్యిందా? పెళ్లి కోసం, మూడు మూళ్లూ వేయడం కోసం, తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అతగాడేం చేశాడో తెలుసుకోవాలంటే మన్మథుడు 2 చూడాల్సిందే. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, పి.కిరణ్ నిర్మాత. గురువారం టీజర్ విడుదలైంది. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ తరహా పాత్రలో నటించడం నాగార్జునకు ఇదే కొత్త. ఆయన పాత్రని మలిచిన విధానం ఆకట్టుకుంటుందని చిత్ర బృందం తెలిపింది.













