మన్మథుడు 2 సెన్సార్ పూర్తి
రాహల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం మన్మథుడు 2. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. యుబైఎ సర్టిఫికెట్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 9న విడుదల కానుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. నాగార్జున క్యారెక్టర్ పుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని, సినిమా మొత్తంలో నాగ్ కామెడీనే హైలెట్‌గా ఉంటుందని తెలుస్తోంది. సమంత, కీర్తిసురేష్‌లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మనం ఎంటర్టైన్ మెంట్స్, నంది ఆర్ట్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













