కంగన నా పాత్రను కూడా తగ్గించేశారు : మిష్టి చక్రవర్తి
మణికర్ణిక చిత్రంలో కంగనా రనౌత్ తన పాత్రను కూడా తగ్గించేశారని అంటున్నారు సినీ నటి మిష్టి చక్రవర్తి. ఇప్పటికే ఈ సినిమా విషయంలో కంగనను వివాదాలు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే డైరెక్టర్ క్రిష్, నటుడు సోనూ సూద్ సినిమా నుంచి అర్ధంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో క్రిష్‌కు బాలీవుడ్ ప్రముఖుల అపూర్వ అశ్రాని, పూజభట్ తదితరులు మద్దతు పలికారు.
సినిమాలో తన పాత్ర గురించి తాజాగా మిష్టి చక్రవర్తి మీడియా ద్వారా వెల్లడించారు. డైరెక్టర్ క్రిష్ మంచి ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. ఆయనతో పనిచేయాలని అనుకునేదాన్ని. మణికర్ణికలో అవకాశం రాగానే వెంటనే అంగీకరించా. అయితే ఇటీవల సినిమా చూసి చాలా బాధపడ్డాను. నా ప్రాతకు క్రిష్ ఇచ్చిన నడివి, ప్రాధాన్యం సినిమాలో లేవు. కంగన నా పాత్రను క్యారికేచర్‌లా మార్చేశారు. డైరెక్టర్ ఎవరైనా సినిమాలోని అన్ని పాత్రలను సమానంగా ప్రేమిస్తారు. కానీ, కంగన తన పాత్రను మాత్రమే ప్రేమించి మిగిలిన పాత్రలను పట్టించుకోలేద`ని మిస్తీ చక్రవర్తి విమర్శించింది.













