Manika Vishwakarma: మిస్ యూనివర్స్ ఇండియాగా మణిక విశ్వకర్మ

ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని మణిక విశ్వకర్మ (Manika Vishwakarma) సొంతం చేసుకున్నారు. జైపుర్ వేదికగా ఆగస్టు 18న జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో ఆమె గెలుపొందారు. 2024 మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా(Rhea Singha) మణికకు కిరీటాన్ని అలకరించారు. ఈ ఏడాది నవంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున మణిక ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇకీ పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ (Tanya Sharma) ఫస్ట్ రన్నరప్‌గా, మోహక్ థింగ్రా (Mohak Thingra) సెకండర్ రన్నరప్‌గా నిలిచారు. హరియాణా అమ్మాయి అమిషి కౌశిక్ (Amishi Kaushik) మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.