మణిశర్మ ఈ ఛాన్స్ ను ఎలా వాడుకుంటాడో
టాలీవుడ్లోని సీనియర్ హీరోలతో పాటూ నెక్ట్స్ జెనరేషన్ హీరోలకు కూడా మ్యూజిక్ ఇచ్చిన వారిలో మణిశర్మ ఉన్నాడు. ఒకప్పుడు మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోతున్నాడు. మణిశర్మ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగులుతున్నాయి.
అలాంటి టైమ్ లో పూరీ జగన్నాథ్-రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మణిశర్మ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ చూసి మణిశర్మకు ఏకంగా 13 సినిమాలకు ఛాన్స్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. కానీ అందులో ఏదీ ఇస్మార్ట్ రేంజ్ ఆల్బమ్ అవలేదు. ఆఖరికి మెగాస్టార్ తో చేసిన ఆచార్య సినిమా కు కూడా మణి గొప్ప మ్యూజిక్ ను ఇవ్వలేకపోయాడు.
దీంతో తనను ఫామ్ లోకి తెచ్చిన పూరీ-రామ్ కాంబోనే మళ్లీ మణిశర్మ నమ్ముకున్నాడు. వీరి కాంబోలో రానున్న డబుల్ ఇస్మార్ట్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఇంతకుముందు మణి-పూరీ కాంబోలో వచ్చిన పోకిరి, చిరుత, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి డబుల్ ఇస్మార్ట్ మణిశర్మకు మరో గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి ఈ అవకాశాన్ని మణిశర్మ ఎలా వాడుకుంటాడో చూడాలి.













