అరుదైన చరిత్ర సృష్టించిన సౌత్ ఇండియన్ సినిమా…
ప్రపంచ సినీ చరిత్రలోనే ఈ మధ్య సౌత్ ఇండియన్ సినిమాలు తమ పవరేంటో చూపిస్తున్నాయి. ఇండియన్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే “RRR” సినిమా ఆస్కార్ నామినేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. షార్ట్ లిస్ట్ లో RRR పేరును కూడా చేర్చడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మరో సౌత్ ఇండియన్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది.
తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం పొన్నియిన్ సెల్వన్ 1 ( పీస్ 1) సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేసి తమిళ ఇండస్ట్రీ హిట్ గా కూడా ఈ చిత్రం నిలిచిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ సినిమా మరొక మెట్టు పైకెక్కింది చెప్పాలి. పొన్నియిన్ సెల్వన్ 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఒకేసారి ఏకంగా ఆరు నామినేషన్లు పొందడం జరిగింది. ఈ విషయాన్ని సినిమా ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ ఛాయాగ్రహణం మరియు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో నామినేషన్స్ ను దక్కించుకోవడం విశేషం. సూపర్ స్టార్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆరు విభాగాల్లో కనీసం రెండు మూడు అవార్డులు అయినా దక్కుతాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈ సినిమా యొక్క సీక్వెల్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ను ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే మణిరత్నం ప్రకటించాడు. హీరో విక్రమ్, విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, త్రిష ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమా లో నటించారు. పీస్ 2 సినిమా కోసం ఇటు ప్రేక్షకులు, అటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.













