Mani Ratnam: కొత్త వాళ్లతో మణిరత్నం లవ్ ఎంటర్టైనర్
సౌత్ లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం(mani ratnam) పేరు కచ్ఛితంగా ఉంటుంది. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు క్లాసిక్స్ గా నిలిచాయి. తర్వాత కొంత కాలం పాటూ ఫామ్ లో లేకుండా పోయిన మణిరత్నం, దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో ఓకే బంగారం(OK Bangaram) సినిమా చేసి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.
ఓకే బంగారం తర్వాత ఆయన నుంచి వచ్చిన కడలి(Kadali), చెలియా(Cheliya), నవాబ్(Nawaab) లాంటి సినిమాలు ఫ్లాప్ అయినా పొన్నియన్ సెల్వన్ తో ట్రాక్ లోకి వచ్చిన మణిరత్నం(Mani Ratnam) ప్రస్తుతం కమల్ హాసన్(Kamal Hassan)తో థగ్ లైఫ్(thug Life) అనే సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా అయ్యాక మణిరత్నం ఎవరితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో మణిరత్నం తన తర్వాతి సినిమాను కొత్త కుర్రాళ్లు, అమ్మాయిలతో ఓ న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ తో వేగంగా పూర్తి చేసేలా ఈ లవ్ ఎంటర్టైనర్ ను మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట. థగ్ లైఫ్ షూటింగ్ వర్క్ క్లైమాక్స్ దశలో ఉన్నప్పుడు ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.













