నేను క్షేమంగానే ఉన్నా… ఆ రూమర్స్ నమ్మొద్దు : సింగర్ మంగ్లీ
తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్ నమ్మొద్దని ప్రముఖ గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. రెండు రోజుల క్రితం ఊహించని విధంగా చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి వస్తున్న రూమర్స్ నమ్మకండి. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు. శంషాబాద్ పోలీసుల వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్థరాత్రి తర్వాత మేఫ్ురాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్`బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగనే కర్ణాటకు చెందిన ఓ డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కాను వెనుక భాగం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. దీనిపై పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లలో వచ్చిన రూమర్స్‌పై ఆమె స్పందించారు.













