ఒక్కసారిగా మంగళవారంకు భారీ బజ్
స్టార్ క్యాస్ట్ లేకుండా వచ్చే లో బడ్జెట్ సినిమాల విషయంలో ప్రమోషన్ చాలా కీ రోల్ పోషిస్తుంది. కంటెంట్ లో ఎంత డెప్త్ ఉందనేది ట్రైలర్ లో చెప్పగలిగితే అదే థియేట్రికల్ బిజినెస్ ను రూల్ చేస్తుంది. ట్రైలర్ కట్ బాగుంటే సినిమా బిజినెస్ పెరిగే అవకాశాలు చాలానే ఉన్నాయని మనం గతంలో చూశాం.
ఇక విషయానికొస్తే, డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన మంగళవారం సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి మొన్నీ మధ్య వరకు అసలెలాంటి బజ్ లేదు. కానీ ట్రైలర్ చూశాక ఇది రెగ్యులర్ సినిమా కాదని, అందరూ గుర్తించారు. ఫలితంగా మంగళవారంకు భారీ బజ్ వచ్చింది.
అందుకే ఈ సినిమా థియేట్రకల్ బిజినెస్ బాగా పెరిగింది. ముందు ఆరు కోట్లనుకున్న మంగళవారం బిజినెస్ ఇప్పుడు ఏకంగా రూ.15 కోట్లకు చేరిందని ట్రేడ్ వర్గాల టాక్. ట్రైలర్ బాగుండటం, దానికి తోడు సోలో రిలీజ్ అవడంతో సినిమా ఎలాగైనా మంచి హిట్ అవుతుందని బయ్యర్లు నమ్ముతున్నారట. ఈ సినిమా మరో విరూపాక్ష కావడం ఖాయమని దర్శకనిర్మాతలు చాలా బలంగా నమ్ముతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.













