మంగళవారంకు కలిసొస్తున్న పొలిమేర2 టాక్
సినిమాలు చూసే ఆడియన్స్ కు అది అందరికీ నచ్చితేనే చూడాలని కండిషన్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ సినిమాల కంటే హర్రర్ టచ్ ఉన్న థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సినిమా చూసినంతసేపు భయపడేలా ఉంటే చాలు. ఆడియన్స్ శాటిస్ఫై అయిపోయి, సినిమాను హిట్ చేసేస్తున్నారు.
పైగా ఈ సినిమాలను ఎలాంటి జనరేషన్ వాళ్లైనా చూడొచ్చు. ఈ ఏడాది విరూపాక్ష లాంటి సినిమా ఇదే జానర్లో వచ్చి మంచి హిట్టైంది. చాలా కాలం తర్వాత తెలుగు తెర మీద హర్రర్ ఫీల్ తెచ్చింది విరూపాక్ష. దానికి ముందు వచ్చన మసూద కూడా ఆడియన్స్ ను భయపెట్టడంలో సక్సెస్ అయింది. రీసెంట్గా వచ్చిన పొలిమేర2 కూడా మంచి టాక్ తెచ్చుకుంది. పొలిమేర2కు మంచి టాక్ రావడం మంగళవారం మూవీకి బాగా కలిసొస్తుంది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేతబడుల నేపథ్యంలో ఈ సినిమాను అనీల్ విశ్వనాథ్ తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు దాని తర్వాత అదే బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మంగళవారం అనే సినిమాపై బజ్ బాగా పెరుగుతుంది. ట్రైలర్‌తో ఆల్రెడీ మంచి హైప్ క్రియేట్ చేసుకున్న మంగళవారం సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా కూడా ఊరిలో జరిగే వరుస హత్యల నేపథ్యంలోనే ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సినిమాలో స్టోరీ కొంచెం గ్రిప్పింగ్ గా ఉంటే మంగళవారం సినిమా సక్సెస్ అవడం ఖాయం. సినిమా ఎలా ఉన్నా పాయల్ మరోసారి ఈ సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేయడం గ్యారెంటీ.













