రైటర్ గా మారిన మంచు విష్ణు
గత కొన్ని సంవత్సరాలుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ముందెవరూ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు కూడా భాగమవుతున్నారని అనౌన్స్ చేయడంతో ఆ సినిమాకు క్రమంగా హైప్ పెరుగుతూ వచ్చింది.
ప్రభాస్, నయనతార, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి అగ్ర తారలు భక్త కన్నప్పలో భాగమవుతున్నారు. మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న భక్త కన్నప్ప ప్రీ లుక్ మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ లుక్ లో గెటప్ విషయంలో క్లారిటీ రాకపోయినప్పటికీ, మంచు శివలింగం ముందు ధనుస్సు ధరించిన కన్నప్పను ఎక్కువగా రివీల్ అవకుండా పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన టీమ్ గురించి కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అందులో ముఖ్యమైంది ఈ సినిమాకు మంచు విష్ణునే స్వయంగా రచయితగా వ్యవహరిస్తున్నాడు. తనికెళ్ల భరణి తయారు చేసిన కథను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లు స్క్రీన్ ప్లే, సీన్స్ ను రాసుకునే బాధ్యతను విష్ణు తీసుకున్నాడు. కన్నప్ప లాంటి వీర భక్తుడి గాథను తెరకు అనుగుణంగా మార్చాలంటే దానికి ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇవన్నీ తెలియకుండా విష్ణు ఆ బాధ్యతను తీసుకుని ఉండడు కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం జనాల నుంచి విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి రైటర్ గా విష్ణు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.













