మళ్లీ తండ్రి కాబోతున్న మంచు విష్ణు
సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు మళ్లీ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘స్పెషల్ ప్రదేశం నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్. ఇది విన్నీ స్వస్థలం. నాకెంతో ఇష్టమైన ప్రదేశం. ఇప్పటికే మా కుటుంబంలోకి అరియానా, వివియానా, అవ్రామ్ వచ్చారు. ఇప్పుడు నాలుగో ఏంజిల్ కూడా రాబోతోంది’ అని పేర్కొంటూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అభిమానులందరూ మంచు విష్ణు దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మంచు విష్ణు ‘ఓటర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. కార్తిక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.













