ఓటర్ విడుదలకు ముహూర్తం కుదిరింది
విష్ణు, సురభి జంటగా నటిస్తున్న చిత్రం ఓటర్. జి.ఎస్.కార్తిక్ దర్శకుడు. రామా రీల్స్ పతాకంపై సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఓటర్ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం విడుదల హక్కులను సార్థక్ మూవీస్ పొందింది. ఈ నెల 21న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ పదవిలో ఉన్న నాయకుడు సరిగా పనిచేయకపోతే ఓటు వేసిన ప్రజలు ఎలా పనిచేయించుకున్నారనేది తెలియజేసే చిత్రమిది. ఓటు హక్కు, ఓటర్ విలువ తెలిపే సినిమా. రాజకీయ నేపథ్యంలో దర్శకుడు అద్భుతంగా తీశారు. సందేశం ఉంది. ప్రేక్షకులను ఆట్టుకునే అనేక సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: రాజేష్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిరణ్ తనమాల













