మంచు ఫ్యామిలీ ఆ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటుందో?
భక్త కన్నప్ప సినిమాకు టాలీవుడ్లో స్పెషల్ ప్లేస్ ఉంది. రాముడు, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు లాంటి దేవుళ్ల మీద ఎన్నో సినిమాలొచ్చాయి కానీ కృష్ణంరాజు చేసిన కన్నప్ప సినిమాను మాత్రం ఇప్పటివరకు ఎవరూ టచ్ చేసే సాహసం చేయలేదు. పరమశివ భక్తుడైన ఆ దైవాంస సంభూతిడి స్టోరీని బాపు కంటే గొప్పగా ఎవరూ చెప్పలేమనే ఉద్దేశంతోనే ఆ సినిమాను ఎవరూ టచ్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఛాలెంజ్‌ను మంచు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసింది. ఆ సినిమాను ఈ తరానికి విజువల్ గా అందించాలని పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ చేసుకుని ఈ సినిమాకు శ్రీకారం చుట్టి పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. నిజానికి ఈ సినిమా గురించి మోహన్ బాబు ఎప్పట్నుంచో చెప్పుకొస్తున్నాడు.
ఫైనల్ గా ఇప్పుడు ఆ సినిమాను కార్యరూపం దాలుస్తూ సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న కన్నప్ప సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. బడ్జెట్ కూడా వంద కోట్ల పైనే ఉంటుందని సమాచారం. మంచు విష్ణుకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రభాస్ తో ఈ సినిమా చేయాలని కృష్ణంరాజు ఎంతో ట్రై చేసినప్పటికీ అది వీలు పడలేదు.
తనికెళ్ల భరణి ఈ సినిమాకు ఓ వెర్షన్ రాశారని విష్ణు చెప్పాడు కానీ ఇది అదేనా లేక మరొకటా అన్నది సినిమా వచ్చే వరకు తెలియదు. గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న విష్ణుకి తన లాస్ట్ మూవీ జిన్నా కూడా డిజాస్టర్ గా మిగలడంతో ప్రస్తుతం ఈ సినిమా తప్ప మరే సినిమాకు కమిట్ అవకుండా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తూ భక్త కన్నప్ప పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.













