Manchu Vishnu: నా వల్ల చెడ్డ పేరు వస్తే నేను బతికినా ఒకటే చచ్చినా ఒకటే
మంచు మోహన్ బాబు(Manchu mohan babu) అంటే క్రమశిక్షణకు మారు పేరు అంటుంటారు. కానీ గత కొన్నాళ్లుగా వారి కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదాలు ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వరకు తెచ్చాయి. గొడవలు ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి కానీ మంచు కుటుంబంలో గొడవలు రోడ్డుకెక్కడంతో ఆ వివాదం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. మంచు ఫ్యామిలీ వర్సెస్ మంచు మనోజ్ గా కొనసాగుతున్న ఈ వివాదాలు ఇప్పటికీ సమసిపోయింది లేదు.
ఇప్పటికీ మంచు మనోజ్(Manchu Manoj), మంచు విష్ణు(Manchu Vishnu) వీలున్నప్పుడల్లా సోషల్ మీడియాలో, మీడియా ముందుకొచ్చి ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకోవడం, ఒకరి గురించి మరొకరు ఇన్‌డైరెక్ట్ గా మాట్లాడి ఎటాక్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన తండ్రి మోహన్ బాబు గురించి విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన తండ్రిని ఎలా సంతోషంగా ఉంచాలనే దాని మీదే ఉందని, తండ్రిగా ఆయన అందరినీ ఎంతో కష్టపడి పెంచారని, ఈ వయసులో ఆయనకు కొడుకుగా ఇవ్వగలిగింది ఒక్క సంతోషం మాత్రమేనని, నేను కష్టపడి ఆయనకు మంచి పేరు తీసుకుని రాకపోయినా పర్లేదు కానీ ఆయనకు చెడ్డ పేరుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకూడదని ఫిక్స్ అయ్యానని, తన వల్ల తండ్రికి చెడ్డ పేరు వస్తే తాను బతికినా చచ్చినా ఒకటేనని కామెంట్స్ చేయగా, ఆ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.






