Manchu Vishnu: కన్నప్ప విషయంలో చేసిన తప్పు అదే

మంచు విష్ణు(Manchu Vishnu) ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప(Kannappa) సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది. కానీ ఇప్పటికీ కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవడానికి తాను చేసిన ఓ తప్పే కారణమంటున్నాడు మంచు విష్ణు. రీసెంట్ గా తమ్మారెడ్డి భరద్వాజ(Thammareddy Bharadwaja) ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించాడు.
తనికెళ్ల భరణి(thanikella Bharani) తనకు 2014లో ఈ సినిమా గురించి ఓ ఐడియా చెప్పారని, ఆ ఐడియాను విదేశీ టెక్నీషియన్లతో డెవలప్ చేయించానని, తన ఆలోచనలకు అనుగుణంగా కథను రెడీ చేయించానని, తన తపన చూసి భరణి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్ లో చేయమని సలహా ఇచ్చారని చెప్పాడు. ముందు కన్నప్ప సినిమాను రూ.100 కోట్ల లోపు పూర్తి చేయాలనుకుంటే అది తీరా రెట్టింపు అయిందని విష్ణు తెలిపాడు.
మహాభారత్(maha Bharath) ను తీసిన ముఖేష్(Mukesh) అయితేనే ఈ కథకు న్యాయం చేయగలడని అతనికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించామని చెప్పిన విష్ణు, ప్రభాస్(prabhas) కెరీర్లోనే ఈ సినిమాలో చేసిన రుద్ర పాత్ర ఓ మైల్ స్టోన్ గా నిలుస్తుందన్నాడు. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తాను కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో వీఎఫ్ఎక్స్ వర్క్స్ ను ప్రావీణ్యం లేని వ్యక్తికి అప్పచెప్పానని, అదే తాను చేసిన తప్పని, దాని వల్లే సినిమా లేటైందని విష్ణు వెల్లడించాడు.