Manchu Vishnu: మైలేజ్ పెరుగుతుందని షుగర్ పోశా మంచు విష్ణు
మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా జరుగుతున్న గొడవల గురించి తెలియని వారు లేరు. మోహన్ బాబు(Mohan babu)- మనోజ్(Manoj) ఒకరినొకరు కొట్టుకుని కేసులు పెట్టుకోవడం, రోజుకో ట్విస్టుతో వివాదం బాగా ముదిరింది. అయితే ఈ గొడవ మొత్తంలో మనోజ్ ఇంటికి వెళ్లి మంచు విష్ణు(Manchu Vishnu) జెనరేటర్ లో పంచదార పోసిన విషయం బాగా హైలైట్ గా నిలిచింది.
ఈ విషయాన్ని స్వయంగా మనోజే ఆరోపించగా, విష్ణు మాత్రం అలాంటిదేం లేదని చెప్పాడు. అయితే ఇప్పుడు విష్ణు నటించిన కన్నప్ప(Kannappa) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయంలో విష్ణు మరోసారి స్పందించాడు. నిన్ను ఎవరెలా మట్లాడినా, మాకు రిప్లై ఇస్తున్న మంచి మనసు నీది. మరి ఆ రోజు జెనరేటర్ లో షుగర్ ఎందుకు వేశావన్నా అని ఓ నెటిజన్ విష్ణుని అడగాడు.
విష్ణు దానికి సమాధానంగా ఇంధనంలో షుగర్ కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివా అని సెటైరికల్ గా సమాధానమిచ్చాడు. ఈ విషయంలో విష్ణు ఏం మాట్లాడినా విషయాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుందని తెలిసే కావాలని ఈ ఆన్సర్ ఇచ్చి టాపిక్ ను డైవర్ట్ చేశాడు. ఇక కన్నప్ప విషయానికొస్తే ఈ మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్(Mohanlal), ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













