సింహం బిడ్డ ఎప్పటికీ సింహమే
నారా బ్రాహ్మణి ఆడ సింహం లాంటి వారు అంటూ బాలకృష్ణ కుమార్తెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు సినీ నటుడు మంచు మనోజ్. తిత్లీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని తొమ్మిది గ్రామాలను బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మనోజ్ ఆమెను అభినందించారు. శ్రీకాకుళం కోసం నారా బ్రాహ్మణి తనవంతు సాయం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. నాకు తెలిసిన దృఢమైన మహిళల్లో ఆమె ఒకరు. అవసరంలో ఉన్నవారి కోసం సాయం చేయడానికి ముందు రావడం నిజంగా అభినందించాల్సిన విషయం. సింహ బిడ్డ ఎప్పటికీ సింహమే జై బాలయ్య అని ట్వీట్లో పేర్కొన్నారు.













