Manchu Manoj: ఆ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న మంచు హీరో

టాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో కల్ట్ క్లాసిక్ అందుకున్న సినిమాలు చాలా తక్కువ. ఆ తక్కువ సినిమాల్లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి(Arjun Reddy) ఒకటి. ఈ మూవీ వారిద్దరి క్రేజ్ ను, మార్కెట్ ను విపరీతంగా పెంచేసింది. అయితే అర్జున్ రెడ్డి సినిమా ముందు వరకు సందీప్ రెడ్డి వంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారనే విషయం తెలిసిందే.
అర్జున్ రెడ్డి కథ రాసుకుని సందీప్ రెడ్డి ఎంతో మంది హీరోలను, నిర్మాతలను కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరకు చేసేదేమీ లేక తానే నిర్మాతగా మారి తన బ్రదర్ తో కలిసి అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించి, ఆ సినిమాతో ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ ను అందుకుని తనని రిజెక్ట్ చేసిన నిర్మాతలతోనే శభాష్ అనిపించుకుని సత్తా చాటాడు.
అయితే అర్జున్ రెడ్డి సినిమా కథ ఎంతో మంది హీరోల దగ్గరకు వెళ్లిన టైమ్ లో ఆ కథ మంచు మనోజ్(Manchu Manoj) దగ్గరకు కూడా వెళ్లిందట. ఈ కథ కోసం మనోజ్ కొన్నాళ్ల పాటూ సందీప్ తో ట్రావెల్ కూడా చేశాడట. కానీ అప్పుడు తనకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఆ సినిమా చేయలేక మిస్ చేసుకున్నానని రీసెంట్ గా భైరవం(Bhairavam) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు మనోజ్ వెల్లడించాడు. ఒకవేళ ఆ రోజు మనోజ్ అర్జున్ రెడ్డి చేసి ఉంటే ఇవాళ మనోజ్ కెరీర్ వేరే లెవెల్ లో ఉండేదని స్పెషల్ గా చెప్పే పన్లేదు.