Manchu Manoj: మౌళికి మనోజ్ బంపరాఫర్

ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే సక్సెస్ అవుతారు, మిగిలిన వారు సక్సెస్ అవరనే అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ ఇప్పటికే ఈ విషయాన్ని తప్పని చాలా మంది ప్రూవ్ చేయగా, రీసెంట్ గా యూట్యూబర్ మౌళి(mouli) లిటిల్ హార్ట్స్(little hearts) మూవీతో మరోసారి నిరూపించారు. సాయి మార్తాండ్(sai marthand) దర్శకత్వంలో వచ్చిన లిటిల్ హార్ట్స్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.
ఇదే విషయాన్ని మంచు మనోజ్(manchu manoj) మరోసారి వెల్లడించాడు. మనోజ్ నటించిన మిరాయ్(mirai) సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించగా మనోజ్ అందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలంటే చిరంజీవి(chiranjeevi), మోహన్ బాబు(mohan babu) కొడుకులే అయ్యే పన్లేదని, మంచి ప్రతిభ, కష్టపడే తపన ఉంటే ఎవరైనా సక్సెస్ అవొచ్చని లిటిల్ హార్ట్స్ తో మౌళి ప్రూవ్ చేశాడని మనోజ్ ప్రశంసించాడు.
అంతేకాదు, ఎప్పుడైనా ఏదైనా సినిమాలో విలన్ పాత్ర ఉంటే తాను తప్పకుండా చేస్తానని మౌళికి మనోజ్ మాటిచ్చాడు. ఇప్పటికే నాని(nani), విజయ్ దేవరకొండ(vijay devarakonda), మహేష్ బాబు(mahesh babu) నుంచి మంచి ప్రశంసలందుకున్న మౌళి, ఇప్పుడు మనోజ్ ఏకంగా తన సినిమాలో విలన్ రోల్ చేస్తానని చెప్పడంతో మౌళికి మరో బంపరాఫర్ దక్కినట్టే అయింది. కాగా అదే సక్సెస్ మీట్ లో మనోజ్ తన సక్సెస్ విషయంలో ఎమోషనల్ అయ్యాడు.