సైలెంట్ గా ఈ రోజు మంచు మనోజ్ వివాహం
ఫ్యామిలీ హీరో మంచు మనోజ్.. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా నాగ మౌనిక వివాహం శుక్రవారం రాత్రి 8.30లకు జరుగనుంది.ఈ పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలకు చెందిన వారు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. కొన్నాళ్ల పాటు వీరిద్దరూ కలిసి రిలేషన్ షిప్ చేసిన తర్వాత పెళ్లి వైపు అడుగు లేశారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే.అయితే మౌనిక మొదటి పెళ్లికి మంచు మనోజ్ అతిథిగా వెళ్లారని, ఇప్పుడామెనే ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2015లో మౌనికకు పెళ్లైంది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వీరి పెళ్లికి మంచు మోహన్ బాబు ఒప్పుకోలేదని, అందుకనే మనోజ్, మౌనికలు చాలా రోజుల పాటు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారనేది కూడా ఇండస్ట్రీలో గుసగుసలుగా వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్‌లోని మంచు లక్ష్మి ఇంట్లోనే మనోజ్, మౌనికల పెళ్లి జరిగిందనేది బయట వినిపిస్తోన్న సమాచారం.చాలా రోజుల పాటు సినీ ఇండస్ట్రీకి, కుటుంబానికి మనోజ్ దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చి వెళుతుండేవారు. ఈ మధ్యలో వాట్ ది ఫిష్ అనే సినిమాను కూడా చేయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. సినిమా గురించి చెప్పారు కానీ.. వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఏమీ చెప్పలేదు. అయితే సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకుంటున్నారు.













