మంచు మనోజ్ కొత్త ప్రయాణం
మోహన్‌బాబు కుటుంబం నుంచి సినిమాల్లోకి అరంగేట్రం చేసిన మంచు మనోజ్ కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నాడట. ఇక నుంచి సినిమాలు చేయనని గతంలో చెప్పి అభిమానుందరికీ షాక్ ఇచ్చాడు. వెంటనే మరుసటి రోజు ఎలా స్పందిస్తారో చూద్దామని అన్నానని వివరిణచ్చాడు. తాజాగా తిరుపతి నుంచి నా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు అక్కడే నివాసం ఉండేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. నా వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోవడానికి పరుగు కూడా ఒక రోజు పరిగెత్తడం ఆపేస్తుంది. ఇవాళో రేపో ప్రతి ఒక్కరికీ ఈ పరిస్థితి తప్పదు. గమ్యం లేని లక్ష్యాలు ఎన్నటికైనా మనశ్శాంతిని దూరం చేస్తాయి. మన ప్రతీ లక్ష్యానికీ ఒక గోల్ ఉండాలి. ఆ లక్ష్యం మన చుట్టు ఉండే ప్రజల్ని ఉద్దరించేలా ఉండాలి. స్నేహితుల కోరిక మేరకు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాను. అన్నీ సంతృప్తితో చేశారు. ప్రపంచంలోని ప్రతి దిక్కు తిరిగాను. దేశంలోని ప్రతి మూలా చూశాను. ఈ ప్రపంచం అద్భుతం, ఆమోఘం అని తెలిపారు. నేను కొరుకునే మనశ్నాంతి నాకు తిరుపతిలో దొరికిందని కచ్చితంగా చెప్పగలను. నేను పెరిగిన ప్రదేశం, నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం స్వేచ్ఛగా ప్రపంచానికి రెక్కలు విప్పుకొని ఎగిరేలా చేసింది అని పేర్కొన్నారు.













