మనోజ్ పెళ్లి, నాన్నకు ఇష్టం లేదు: మంచు లక్ష్మి
మంచు మనోజ్ రీసెంట్ గా భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి మంచు మోహన్ బాబుకు, విష్ణుకు ఇష్టం లేకుండా జరిగిందని నెట్టింట చాలానే కామెంట్స్ వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా మంచు మనోజ్ అక్క మంచు లక్ష్మి రియాక్ట్ అయింది. నిజంగానే ఈ పెళ్లి మోహన్ బాబు కు ఇష్టం లేకుండా జరిగిందని ఆమె వెల్లడించింది.
మనోజ్-మౌనికల పెళ్లి తానే జరిపించినట్లు, దాని కోసం ఆమె ఎంతగానో కష్టపడినట్లు చెప్పింది. ఇద్దరివీ పెద్ద కుటుంబాలు కావడం, రెండో పెళ్లి కావడం వల్ల వారిద్దరూ జీవితాంతం కలిసి ఉంటారా లేదా అనే డౌట్స్ తో మోహన్ బాబు ఈ పెళ్లికి ఒప్పుకోలేదని లక్ష్మి చెప్పుకొచ్చింది. దీంతో ఆమె యాదాద్రి వెళ్లి మొక్కుకున్నట్లు, ఆ తర్వాత వెంటనే పెళ్లికి మోహన్ బాబు ఓకే అన్నారని, అందుకే పెళ్లి తర్వాత మనోజ్, మౌనిక ను తీసుకుని యాదాద్రి వెళ్లినట్లు మంచు లక్ష్మి చెప్పింది.
అంతేకాదు పెళ్లికి ముందు కూడా మనోజ్, మౌనిక తన ఇంట్లోనే ఉన్నారని, పెళ్లి తర్వాత మౌనిక తనకు ఫోన్ చేసి ఏది ఎలా చేయాలో అడుగుతూ ఉండేదని, తను చెప్పకుండా టార్చర్ చేస్తుంటానని మంచులక్ష్మి వెల్లడించింది. మొత్తానికి అయితే మనోజ్- మౌనిక ల పెళ్లి జరగడానికి కారణమైతే తనే అని క్రెడిట్ మొత్తం తీసేసుకుంది మంచు లక్ష్మి.













