Manchu Lakshmi: మంచు లక్ష్మి ముంబై పర్యటన వెనుక కారణమిదేనా?

మోహన్ బాబు(mohan babu) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి(Manchu Lakshmi) కొన్నాళ్లకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హోస్ట్ గా, యాంకర్ గా, నిర్మాతగా, నటిగా పలు విభాగాల్లో తన సత్తా చాటి సొంతంగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తుంది లక్ష్మి. అయితే మంచు లక్ష్మి గతంలో లాగా ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా కనిపించడం లేదు.
ఇంకా గమనిస్తే లక్ష్మి ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. గత సంవత్సర కాలంగా మంచు లక్ష్మి తన హోమ్ ను ముంబైకు మార్చేసుకుంది. అప్పుడప్పుడు మాత్రమే టాలీవుడ్ లో కనిపిస్తూ వస్తున్న మంచు లక్ష్మి అసలు ముంబై రెగ్యులర్ గా వెళ్లడానికి కారణమేంటో ఇన్నాళ్లకు తెలిసింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్(Karan Johar) బాలీవుడ్ లో ది ట్రయేటర్స్(The Traitors) అనే రియాలిటీ షోను చేస్తున్నాడు.
ఆ రియాలిటీ షో లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి మంచు లక్ష్మి కనిపించి అందరినీ షాకయ్యేలా చేసింది. రీసెంట్ గా ఈ రియాలిటీ షో కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా, అందులో లక్ష్మి కూడా ఉంది. రాజస్తాన్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో ఈ రియాలిటీ షో జరగనుండగా, ఈ రియాలిటీ షో జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెలికాస్ట్ కానుంది.