హేటర్స్ కు మంచు లక్ష్మి కౌంటర్
యాంకర్, నటి, నిర్మాత మంచు లక్ష్మి కోపంతో రగిలిపోతుంది. షిట్.. అంటూ తిట్టేస్తూ తన కోపాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. సోషల్ మీడియాలో తన ట్వీట్స్ ను, తనని ద్వేషించే వారందరికీ షిట్ అని సింపుల్ గా చెక్ పెట్టింది. ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ వెన్ ఐ గేవ్ ఏ షిట్ అంటూ వెటకారంగా, తన మీద ట్రోల్స్ చేసే వారి గురించి స్పందించింది. నా హేటర్స్ ను పట్టించుకునే సిట్యుయేషన్స్ లో నేను లేను అని కూడా చెప్పుకొచ్చింది.
తన హేటర్స్ అందరికీ మంచు లక్ష్మి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎదుటోళ్లు ఏం చేసినా బాధపడే మానసిక పరిస్థితిలో నేను లేనంటూ లక్ష్మి చెప్పకనే చెప్పింది. అసలు లక్ష్మి ఇంతలా రియాక్ట్ అవడానికి కారణమేంటంటే, ఇటీవలే కరోనా సోకిన కేటీఆర్ కు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసింది లక్ష్మి. ఇప్పుడు కేటీఆర్ తో చేసిన ట్వీట్ గురించే అసలు ఈ రచ్చంతా.
గెట్ వెల్ సూన్ బడ్డీ, వాచ్ ఆల్ మై మూవీస్ నౌ.. అంటూ మంచు లక్ష్మి కేటీఆర్ కు చెప్తూ ట్వీట్ చేయగా, దాని గురించి నెటిజన్స్ సెటైర్లు వేయడం మొదలెట్టారు. మీ సినిమాలు చూసే కంటే చచ్చిపోవడం నయం అక్కా, మీ సినిమాలు చూస్తూ త్వరగా కోలుకోవడం ఏంటక్కా అని మరొకరు, బడ్డీ ఏంటి అని ఇంకొకరు ఇలా ఎవరికి నచ్చింది వారు అనేశారు. వీటన్నింటికీ రియాక్ట్ అవుతూనే లక్ష్మి షిట్ అంటూ ట్వీట్ చేసింది. మొత్తానికి రెండ్రోజులుగా ఏదొక విధంగా లక్ష్మి వార్తల్లో నిలుస్తూనే ఉంది.













