రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు.. ప్రేమ కూడా
నందు, ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం మనసు పలికే మౌన ప్రేమ. బాబీ వేంపల్లి దర్శకుడు బొట్రేపల్లి అవుల కుంట్ల సూర్య ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. రాయలసీమ అంటే కేవలం ఫ్యాక్షన్ కాదు.. ప్రేమ కూడా ఉంటుందని తెలిపే కథతో, 1980 సీమ విలేజ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జనవరి చివర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్ గౌడ్‌తో పాటుగా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఛాయగ్రహణం:కుమారన్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: బాబీ వేమల్లి, కథ, నిర్మాత: బుట్రేపల్లి ఆవుల కుంట్ల సూర్యప్రాష్.













