మనమే టీమ్ పరిగెట్టాల్సిందే!
మొత్తానికి చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లేమీ లేకుండా మే నెల ముగిసింది. రేపటి నుంచి జూన్ నెల ప్రారంభం కానుంది. వచ్చే 7వ తేదీన మనమే సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ దగ్గర్లో ఉన్నప్పటికీ, ప్రమోషన్స్ కు ఎక్కువ టైమ్ లేదని తెలిసినా కూడా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మనమే సినిమాను జస్ట్ పది రోజుల ముందే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది.
దీంతో ఇప్పుడు టీమ్ మొత్తం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రమోషన్స్ కు టైమ్ తక్కువ ఉండటంతో పాటూ మనమే టీమ్ కు మరికొన్ని సమస్యలున్నాయి. అందులో మొదటిది ఎలక్షన్స్ రిజల్ట్స్. జూన్ 4న ఏపీలో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. రిజల్ట్స్ కు ఒక రోజు ముందు నుంచి ఆ హడావిడి ఉంటుంది. రిజల్ట్స్ వచ్చాక తర్వాతి రోజు కూడా జనాలు అదే మూడ్ లో ఉంటారు.
అంటే జూన్ 3 నుంచి 5 వరకు అందరూ ఎలక్షన్ రిజల్ట్సే లోకంగా ఉంటారు. ఇలాంటి టైమ్ లో మనమే టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి. సినిమాపై ఉన్న బజ్ ను పెంచాలి. టీజర్ బాగుందిలే అనుకుంటే కుదరదు. ఆడియన్స్ థియేటర్ల వరకు రావాలంటే వాళ్లకు ముందు కంటెంట్ ఏంటనేది ట్రైలర్ ద్వారా చూఛాయగా చెప్పాలి. పోటీ పరంగా కాజల్ సత్యభామ, నవదీప్ లవ్ మౌళి ఉన్నాయి. మరోవైపు ప్రేమకథా చిత్రం, భారతీయుడు రీరిలీజ్ కానున్నాయి. ఇంత పోటీ మధ్య ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయాలంటే ఈ లోపు మనమే టీమ్ ఎంతో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే తప్ప కుదరదు.













