మనమే సినిమాలో 16 పాటలు.. సాహసమనే చెప్పాలి
ఒకప్పుడంటే సినిమాలో ఎక్కువ పాటలుండేవి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమలో మహా అయితే అయిదారు పాటలుండటమే మహా కష్టంగా మారిపోతుంది. వాటిని షూట్ చేయడంలో ఉన్న రిస్క్ ఒక కారణమైతే అన్ని సాంగ్స్ బెస్ట్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్లు కరువవడం మరో రీజన్. అందుకే పాన్ ఇండియా సినిమా అయినా సరే నాలుగైదు పాటల్లోపే ఉంటున్నాయి.
అయితే జూన్ 7న రిలీజ్ కాబోతున్న శర్వానంద్ మనమే సినిమాలో ఏకంగా 16 సాంగ్స్ ఉంటాయని డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చైల్డ్ కామెడీ మరియు సెంటిమెంట్ మీద నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఇంత పెద్ద ఆల్బమ్ అంటే షాక్ అవక తప్పదు. మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ కు ఈ సినిమానే బెస్ట్ వర్క్ అవుతుందని, రీ రికార్డింగ్ కూడా అంతే బెస్ట్ ఇచ్చాడని డైరెక్టర్ చెప్పిన మాటలు వింటుంటే మ్యూజిక్ లవర్స్ కు ట్రీట్ అవుతుందనిపిస్తుంది.
మరి ఈ 16 పాటలు ఒకే లెంగ్త్ లో ఉంటాయా లేక మాంటేజ్ సాంగ్స్ లా వచ్చి వెళ్తాయా అన్నది చూడాలి. మ్యూజిక్ విషయంలో ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం మిగిలిన డైరెక్టర్లు కూడా దీన్ని అనుసరించే వీలుంది. ఖుషి నుంచి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హేశం కు ఈ సినిమా మంచి ప్రమోషన్ అయ్యే ఛాన్సుంది. ఈ సినిమా విజయం అందులో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకం కానుంది.













