మరోసారి మనం కాంబినేషన్ రిపీట్ కానుందా?

అక్కినేని నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబోలో రాబోతున్న ‘బంగార్రాజు’ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో అక్కినేని ఇద్దరబ్బాయిలు ఇద్దరు కనిపించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న ‘బంగార్రాజు’ సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో ‘బంగార్రాజు’ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగ్. దీంతో ఈ పాత్ర పేరునే టైటిల్‌గా తీసుకొని కళ్యాణ్ కృష్ణ మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు రావాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికైతే చాలా రోజుల పాటు ఈ మూవీ స్క్రిప్ట్ పనులపై కసరత్తులు చేసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.. ఈ సినిమాను జులైలో సెట్స్ పైకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున జోడీగా రమ్యకృష్ణ నటించనుండగా.. నాగార్జున తనయుడు నాగ చైతన్య ఓ ముఖ్యపాత్ర పోషించబోతున్నారు.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ ప్రాజెక్టులో అక్కినేని అఖిల్ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. వెండితెరపై నాగార్జున మనవడిగా అఖిల్ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. నాగార్జున కొడుకుగా నాగ చైతన్య నటించనుండగా.. ఆయన తనయుడిగా అఖిల్ కనిపిస్తారట. చైతూ రోల్ కొంతసేపే ఉంటుందట కానీ అఖిల్‌కి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇవ్వబోతున్నారట. తాత- మనవడిగా నాగార్జున అఖిల్ పర్‌ఫార్‌మెన్స్ పీక్స్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల కథ అంతా కూడా నాగార్జున అఖిల్ ల మధ్యే నడిచేలా బలమైన స్క్రిప్ట్ రెడీ చేశారని తెలిసింది.