MSG: చిరూ సినిమాకు రెండు ఈవెంట్లు
ఎప్పుడైనా సినిమా తీయడం ముఖ్యం కాదు, దాన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్లడం ముఖ్యం. అందుకే మేకర్స్ దాని కోసం ఎంత ఖర్చైనా చేస్తారు. ప్రమోషన్స్ అనేది ఇప్పుడంత కీలకంగా మారాయి. మూవీ ప్రమోషన్స్ పైనే సినిమా యొక్క ఓపెనింగ్స్ ఆధారపడి ఉన్నాయంటే ప్రమోషన్స్ ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ విషయంలో డైరెక్టర్లు, నిర్మాతలు స్పెషల్ స్ట్రాటజీలను ఫాలో అవుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే ప్రమోషన్స్ అంటే అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఏ రేంజ్ లో యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమాకు అనిల్ వేసిన ప్రమోషనల్ ప్లాన్ కు అంతా షాకయ్యారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu) కోసం కూడా అనిల్ అలాంటి ప్లానే వేసినట్టు తెలుస్తోంది.
నయనతార(Nayanthara) హీరోయిన్ గా వెంకటేష్(Venkatesh) గెస్ట్ రోల్ లో నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు(MSG) సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చూస్తుంది. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించి రెండు గ్రాండ్ ఈవెంట్స్ చేయాలని డిసైడయ్యారట మేకర్స్. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ పేరిట రెండు ఈవెంట్స్ ను చేసి వాటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో, మరొకటి తెలంగాణలో చేసి సినిమాకు ఉన్న హైప్ ను విపరీతంగా పెంచాలని చూస్తున్నాడట అనిల్ రావిపూడి.






