Mana Shankaravaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు మూవీ లేటెస్ట్ అప్డేట్

సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి(anil Ravipudi) ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu) టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్(Venkatesh) గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.
చిరూ(chiru)తో అనిల్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో అందరికీ దీనిపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా అనిల్ దీన్ని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా చిరూ బర్త్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి దాంతో విపరీతమైన రెస్పాన్స్ ను అందుకున్న అనిల్, ఈ సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేసుకున్న మన శంకరవరప్రసాద్ గారు, అక్టోబర్ నుంచి మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో సినిమా మేజర్ షూటింగ్ ను పూర్తి చేయాలని అనిల్ చూస్తున్నాడట. అక్టోబర్ షెడ్యూల్ లోనే అనిల్ రావిపూడి కూడా జాయిన్ కానుండగా వీలైనంత త్వరగా షూటింగ్ ను ఫినిష్ చేసి, ఎక్కువ టైమ్ ను ప్రమోషన్స్ కు కేటాయించాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడట.