MSG: మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki vasthunnam) సినిమా తర్వాత అనిల్ రావిపూడి(anil ravipudi), మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో కలిసి చేస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad Garu). నయనతార(nayanathara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అనిల్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతుండగా, విక్టరీ వెంకటేష్(Venkatesh) ఈ మూవీలో ఓ క్యామియో చేస్తున్నారు. చిరూ(chiru), అనిల్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై ముందు నుంచి మంచి అంచనాలున్నాయి.
దానికి తోడు వెంకటేష్ కూడా వారికి తోడవడంతో ఈ సినిమాపై హైప్ ఇంకాస్త పెరిగింది. ఇదిలా ఉంటే అనిల్ ఏ సినిమానైనా చాలా త్వరగా పూర్తి చేస్తాడనే పేరుంది. ఇప్పటివరకు ప్రతీ సినిమానూ అనిల్ వేగంగానే పూర్తి చేశాడు. ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాను కూడా అనిల్ అదే స్పీడులో పూర్తి చేస్తున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ పై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు సంబంధించి మరో రెండు పాటలు, రెండు ఫైట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని, మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తైందని, ఆ రెండు సాంగ్స్ లో ఓ సాంగ్ చిరంజీవి, వెంకటేష్ పై షూట్ చేయనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ క్రేజ్ నెలకొనగా, భీమ్స్ సిసిరోలియో(Bheems ciciroleo) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.







