MSG: మన శంకరవరప్రసాద్ గారు రన్ టైమ్ పై క్రేజీ అప్డేట్
గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా, ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నారు.
ఈ కారణాలతో ఇప్పటికే మన శంకరవరప్రసాద్ గారు మూవీపై భారీ హైప్ నెలకొనగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టగా, ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది.
మన శంకరవరప్రసాద్ గారు మూవీ రన్ టైమ్ మొత్తం 2 గంటల 38 నిమిషాలని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న సినిమా కావడంతో ఈ రన్ టైమ్ అంత ఎక్కువేమీ కాదనే చెప్పాలి. సినిమా కాస్త ఎంటర్టైనింగ్ గా ఉంటే ఆడియన్స్ కు ఇది పెద్ద సమస్యేమీ కాదు. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.













