డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుందామనుకున్నా: మమతా మోహన్ దాస్
టాలీవుడ్ లోకి సింగర్ గా అడుగుపెట్టి హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్. నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాతో తెరంగ్రేటం చేసింది మమత. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోస్ నాగార్జున, వెంకటేష్ సరసన నటించి ప్రేక్షకులని ఆకట్టుకుంది. హోమం, చింతకాయల రవి వంటి సినిమాలు ఈ అమ్మడికి తెలుగులో మంచి పేరుని తీసుకొచ్చాయి. తన మాతృభాష అయినటువంటి మలయాళంలో కూడా సింగర్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకుంది మమతా మోహన్ దాస్.
తెలుగులో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే మమతా తమిళ, మలయాళ సినిమాలపై దృష్టి పెట్టింది. తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవడంతో మలయాళ ఇండస్ట్రీలో స్థిరపడింది ఈ అమ్మడు. తర్వాత అక్కడ కూడా కొన్ని చిత్రాల్లో నటించి కనుమరుగైంది. కాన్సర్ కారణంగా సినిమాలకి దూరమైనట్టు ఆ మధ్య మమతా సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. త్వరగానే అనారోగ్యం నుండి కోలుకుని తన పర్సనల్ లైఫ్ లో బిజీగా మారింది ఈ హీరోయిన్ కం ప్లే బ్యాక్ సింగర్.
అయితే రీసెంట్ గా తను మరొక వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి ఆమె అభిమానులకి షాక్ ఇచ్చింది. విటిలిగో అనే అరుదైన వ్యాధి సోకడంతో తాను డిప్రెషన్ కి లోనయ్యానని, రాత్రుళ్ళు వంటరిగా కూర్చుని ఏడ్చేదాన్నని ఆమె తెలిపారు. డిప్రెషన్ కారణంగా ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకుని చనిపోదామనుకున్నా అని మమతా మోహన్ దాస్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికీ ఈ వ్యాధికి సంబంధించిన మచ్చలు తన చేతులపై చూడొచ్చు అని ఆమె అన్నారు. ఎవరైనా ఏంటి ఆ మచ్చలు అని అడిగితే నా ఇంస్టాగ్రామ్ పేజీ ని చుడండి, మీకే అర్ధమవుతుంది అని చెప్తాను అని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చారు.













