అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి – అనిల్ సుంకర క్రేజీ ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ లో మమ్ముట్టి
యంగ్, ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి మొదటిసారి గా భారీ బడ్జెట్ తో స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్` కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అఖిల్ ని మునుపెన్నడూ చూడని డాషింగ్ లుక్ లో ప్రెజెంట్ చేసారు. ఏజెంట్ లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో సరికొత్త గా కనిపిస్తాడు స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కథానాయిక గా కొత్త నటి సాక్షి వైద్య ఎంపికైంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.
అఖిల్ తన గత సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో బ్లాక్ బస్టర్ ని సాధించిన ప్రామిసింగ్ స్టార్. సురేందర్ రెడ్డి నిష్ణాతుడైన దర్శకుడు, వక్కంతం వంశీ ప్రొఫిషెంట్ రచయిత. ఎకె ఎంటర్టైన్మెంట్స్ విజయవంతమైన బ్యానర్ అయినందున ఇది ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్ గా మారుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న భారతీయ సినిమా స్టార్. ఈ సినిమా లో పూర్తి నిడివి గల ముఖ్యమైన పాత్రను పోషించడానికి చిత్ర బృందం తో చేరాడు. హైప్ క్రియేట్ చేస్తున్న మమ్ముట్టి పోస్టర్ఏజెంట్ తాజా షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమయింది. ఇందులో మమ్ముట్టి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మమ్ముట్టి పోస్టర్ను విడుదల చేసారు. `ద డెవిల్ రూత్ లెస్ సేవియర్` అంటూ ఇంట్రెస్టింగ్ కాప్షన్ పెట్టారు. అందుకు తగినట్లుగా క్రూరమైన రక్షకుడు గా ఆ లుక్లో మమ్ముట్టి కనిపించాడు. లుక్స్ పర్ ఫెక్ట్ గా వున్నాయి. పోస్టర్ ఆయన కేరెక్టర్ కు హైప్ పెంచేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. రఘుల్ హెరియన్ ధరుమన్ కెమెరా బాధ్యతలు చేపట్టారు.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.













