వై యస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్మూట్టి ‘యాత్ర’
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రాష్ట్రరాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ లొ మళయాల సూపర్‌స్టార్ మమ్మూట్టి నటిస్తున్న చిత్రం ‘యాత్ర’ ఈ చిత్రం దర్శకుడు మహి వి రాఘవ్ కు భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ చిత్రాల నిర్మాతలకు అంత పాపులారిటీ లేదు కాబట్టి ఈ బయెపిక్ కి అంతగా ప్రచారం రాలేదు. గొప్ప ప్రజా నాయికుడి పాత్రలో నటిస్తున్న మమ్మట్టికి తప్ప ప్రత్యేక ఆకర్షణలు లేవు. కాకపోతే ఆ ప్రజానాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటిస్తున్నారు మమ్మట్టి. ఇప్పటికే విడుదల చేసిన మెదటి లుక్ కి, టీజర్ కి రెండు రాష్ట్రాల ప్రజల నుండి అనూహ్యమైన స్పందన రావటంతో యూనిట్ అంతా చాలా ఆనందంగా వున్నారు. సినిమాని వ్యాపారంగా కాకుండా ఫ్యాషన్ గా చిత్రాలు నిర్మించే నిర్మాణ సంస్థలు తెలుగు ఇండస్ట్రిలో చాలా తక్కువుగా వున్నాయి. ఆ కోవలోకి వచ్చే మరో నిర్మాణ సంస్థ 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్. ఈ బ్యానర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి లు సంయుక్తంగా భలేమంచిరోజు, ఆనందోబ్రహ్మ చిత్రాలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. బ్యానర్ లో హ్యట్రిక్ చిత్రంగా రూపోందుతున్న యాత్ర ని ప్రెస్టెజియస్ ప్రోజెక్ట్ గా, అత్యంత భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమెషన్ తో కూడిన పాత్రలు, పాత్ర తీరులు కనిపిస్తాయి. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
నిర్మాతలు తమ మాటల్లో “60 రొజుల్లో 1500 కిలోమీటర్స్ కాలి నడకతో కడప దాటి ప్రతి ఇంటి గడప లొకి వెళ్ళి పెదవాడి కష్టాన్ని, అక్కచెల్లెళ్ళ భాదల్ని, రైతుల ఆవేదనని చూసి వారితో కలసి నడిసి వారి గుండె చప్పుడుగా మారి వారి కష్టాల్ని తన కళ్ళతో చూసి బరువెక్కిన గుండెతో ప్రజల హ్రుదయాల్లో స్థానం సంపాయించిన ఎకైన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.. ఆయన బయెపిక్ ని ఆయన ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా చిత్రీకరిస్తున్నాము. మా బ్యానర్ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ లో ఎప్పుడూ కాంప్రమైజ్ అయ్యి చిత్రాలు తీయలేదు. మా గత రెండు చిత్రాలు కూడా కథ డిమాండ్ ప్రకారం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాము. అదే విధంగా మేము తలపెట్టిన ఈ భారీ సంకల్ప యాత్ర ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాము. “. అని అన్నారు.













