స్పిరిట్ లో ఆ స్టార్ యాక్టర్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) చేతిలో ఎన్ని సినిమాలున్నప్పటికీ అందరి దృష్టి సందీప్ రెడ్డి(sandeep reddy) దర్శకత్వంలో రానున్న స్పిరిట్(spirit) పైనే ఉంది. యానిమల్ సినిమాలో చూసిన ఊచకోత కంటే ఈసారి స్పిరిట్ లో ఎక్కువ ఉంటుందని చెప్పడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే సినిమా ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయింది.
డైలాగ్ వెర్షన్ కోసం సందీప్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాడు. అయితే స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్న సందీప్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల కోసం కొంతమంది స్టార్ నటీనటులను సంప్రదిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే స్పిరిట్ లో ఓ ముఖ్య పాత్ర కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty)ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
స్పిరిట్ లో ఓ ఉన్నత పోలీసాఫీసర్ క్యారెక్టర్ ఉంటుందని ఆ పాత్ర కోసం మమ్ముట్టిని అనుకుంటున్నారని కొందరంటుంటే, హీరో తండ్రి పాత్రకు అనుకుంటున్నారని మరికొందరంటున్నారు. అయితే వాస్తవానికి సందీప్ రెడ్డి ఇప్పటివరకు ఎవరినీ ఫైనల్ చేయలేదని కేవలం ఇవన్నీ చర్చల దశలోనే ఉన్నాయని అందులో భాగంగానే మమ్ముట్టి పేరు కూడా బయటికొచ్చిందని సమాచారం.













