Spirit: స్పిరిట్ లో మరో స్టార్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) లైనప్ లో పలు భారీ సినిమాలున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్(the Raja saab), ఫౌజీ(Fauji) సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాల తర్వాత అర్జున్ రెడ్డి(Arjun Reddy), యానిమల్(Animal) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy Ganga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఇదే.
స్పిరిట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు ఆ సినిమా రిలీజవుతుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పిరిట్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోను తీసుకునే ఆలోచనలో సందీప్ ఉన్నారని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty).
ఆల్రెడీ యానిమల్ కోసం అనిల్ కపూర్(anil Kapoor) ను రంగంలోకి దింపి, ఆ సినిమా తర్వాత ఆయన్ను బాగా బిజీ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈసారి మమ్ముట్టిని రంగంలోకి దింపున్నాడని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. కాగా స్పిరిట్ లో యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హీరోయిన్ గా ఎంపికవగా, ఈ సినిమా మెయిన్ ప్లాట్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. టీ సిరీస్(t series), భద్రకాళి పిక్చర్స్(Badrakali pictures) భారీ బడ్జెట్ తో స్పిరిట్ ను నిర్మించనున్నారు.